Noida: నోయిడాలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవరిస్తూ.. ఆమెపై దాడికి పాల్పడినందుకు ఓ బీజేపీ నాయకుడిపై కేసు నమోదైంది.
BJP Kisan Morcha: ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేసినందుకు నోయిడా పోలీసులు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు. బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యునిగా సోషల్ మీడియాలో తనను తాను గుర్తించుకున్న శ్రీకాంత్ త్యాగి, హౌసింగ్ సొసైటీలో జరిగిన గొడవతో మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. నోయిడాలోని సెక్టార్-93బిలోని గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలో శ్రీకాంత్ త్యాగి కొన్ని చెట్లను నాటడం పట్ల ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒకటి శ్రీకాంత్ త్యాగి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, మహిళపై దాడి చేసినట్లు చూపబడింది. త్యాగి తన భర్తపై అనుచిత పదజాలంతో దూషించడమే కాకుండా ఆమెపై కించపరిచే వ్యాఖ్యలతో నడుచుకున్నారు. శ్రీకాంత్ త్యాగి సొసైటీ పార్కును అక్రమంగా ఆక్రమించారని, ఇది ఇతర నివాసితులకు అసౌకర్యం కలిగించిందని ఆరోపించారు. పార్క్‌ను అక్రమంగా ఆక్రమించడంపై ఆయనకు నోటీసులు అందాయి, అయితే శ్రీకాంత్ అందుకు నిరాకరించి తన పదవిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు.
ఈ విషయంపై మహిళ శ్రీకాంత్ త్యాగితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అతడు ఆగ్రహాంతో ఊగిపోతూ ఆమెను దుర్భాషలాడాడు. మహిళ నిరసన వ్యక్తం చేయడంతో, త్యాగి ఆ మహిళను తోసేశాడు. ఈ ఘటనను అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ ఘటన తర్వాత శ్రీకాంత్ త్యాగిపై పోలీసులు కేసు నమోదు చేశారు."శ్రీకాంత్ త్యాగిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, ఆగ్రహానికి గురి చేసే ఉద్దేశ్యంతో లేదా అతను ఆమె నిరాడంబరతకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిసి) కింద కేసు నమోదు చేయబడింది" అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మహిళా భద్రత) ) అంకిత శర్మ PTI కి చెప్పారు.
"కేసుపై తగిన విచారణ తర్వాత ఆరోపణలు జోడించబడవచ్చు" అని IPS అధికారి తెలిపారు. కాగా, ఇండియా టుడే తన ప్రతిస్పందన కోసం బీజేపీ నాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా.. దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. అయితే, పీటీఐ నివేదిక ప్రకారం.. స్థానిక బీజేపీ ఆఫీస్ బేరర్ పార్టీ నోయిడా యూనిట్‌తో సంబంధం లేదనీ, ఇక్కడ ఎటువంటి పదవిని కలిగి లేరని చెప్పారు. "అతని పని ప్రాంతం ఘజియాబాద్ లోనే అని చెప్పినట్టు పీటీఐ పేర్కొంది. కాగా, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
