Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ పోలీసుల పెద్ద విజయం.. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు పాపల్ ప్రీత్ సింగ్ అరెస్టు..

అమృత్ పాల్ సింగ్ కు మెంటార్ గా భావిస్తున్న పాపల్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడికి పాకిస్థాన్ ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

A big success of Punjab Police.. Amrit Pal Singh's follower Papal Preet Singh arrested..ISR
Author
First Published Apr 10, 2023, 4:28 PM IST

ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు జరుపుతున్న అన్వేషణలో పెద్ద విజయం సాధించారు. అతడి అనుచరుడు పాపల్ ప్రీత్ సింగ్ ను హోషియార్ పూర్ లో సోమవారం అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు, ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన ఆపరేషన్ లో పాపల్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.

అగ్నిపథ్ ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ చెల్లుతుందని, ఏకపక్షం కాదన్న ధర్మాసనం 

అమృత్ పాల్ సింగ్ కు మెంటార్ గా భావిస్తున్న పాపల్ ప్రీత్ కు పాకిస్థాన్ ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దేశ రాజధానిలో పాపల్ ప్రీత్, అమృత్ పాల్ కనిపించడంతో పంజాబ్ పోలీసులు ఈ ఆపరేషన్ కోసం ఢిల్లీ పోలీసులను కూడా సంప్రదించారు. వీరిద్దరిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గతంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కలిసి గుర్తించింది.

ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ మార్చి 18 నుంచి పోలీసుల మోసం చేస్తూనే ఉన్నాడు. అమృత్ పాల్ సింగ్ మార్చి 18వ తేదీన జలంధర్ జిల్లాలో వాహనాలు, రూపురేఖలు మార్చుకుంటూ పోలీసుల వలలో నుంచి తప్పించుకున్నాడు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి, ప్రభుత్వోద్యోగులు చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు సృష్టించడం వంటి పలు క్రిమినల్ కేసుల కింద ఆయనపై, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios