విష్ణు సమంత్ అనే వృద్ధుడు ఈత కొడుతుండగా 20 ఏళ్ల యువకుడు ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు. దీంతో 72యేళ్ళ సామంత్ మృతి చెందాడు.
ముంబై : మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పలకరిస్తుందో తెలియదు. ప్రమాదం ఏ వైపునుంచి దాడి చేస్తుందో చెప్పలేం. ఏ ఘటన ఉన్నఫళాన మనిషిని విగతజీవిగా చేస్తుందో ఊహించలేం. ఇటీవలి కాలంలో ఇలాంటి మరణాలు.. ఘటనలు ఆశ్చర్యానికి, విషాదానికి లోను చేస్తున్నాయి. అలాంటి ఓ ఘటనే ఇది.
ముంబైలోని స్విమ్మింగ్ పూల్‌లో మరొక వ్యక్తి ఎత్తు నుండి దూకడంతో 72 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఎత్తునుండి అతను దూకడంతో ఊపిరి ఆడలేదో.. ఆ నీటి ఒత్తిడికి తట్టుకోలేకపోయాడో వృద్ధుడు మరణించాడు. దీనిమీద ఓ పోలీసు అధికారి ధృవీకరించారు.
వివాహేతర సంబంధం : ప్రియురాలి కొడుకును వేడి నీటి బకెట్లో ముంచి.. చిత్రహింసలు.. చివరికి..
ముంబై గోరేగావ్ ప్రాంతంలోని ఓజోన్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు. మృతుడిని విష్ణు సామంత్‌గా గుర్తించామని, ఈత కొడుతుండగా 20 ఏళ్ల యువకుడు ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడని అధికారి తెలిపారు.
"విష్ణు సామంత్ మెడ, ఇతర శరీర భాగాలపై గాయాలు ఉన్నాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోగా అతను మరణించాడని వారు ప్రకటించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు, 20 ఏళ్ల వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం)- కింద కేసు నమోదు చేయబడింది" అని పోలీసులు తెలిపారు.
