నోయిడా, సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీ వద్ద తెల్లవారుజామున 5.45 గంటలకు ఈ ఘటన జరిగింది. బాల్కనీ నుంచి పడి 5 యేళ్ల చిన్నారి మృతి చెందాడు. 

నోయిడా : హైరైజ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలోని ఎనిమిదో అంతస్థులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి ఐదేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీ వద్ద తెల్లవారుజామున 5.45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు నిద్రిస్తున్నారని వారు తెలిపారు.

"కొన్నిసార్లు అబ్బాయి ఇంట్లో అందరికంటే ముందే నిద్రలేస్తాడు. ఇంట్లో ఒంటరిగా అటూ, ఇటూ తిరుగుతుంటాడు. ఈ రోజు కూడా అలాగే లేచాడు. బాల్కనీలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్లాడు. దాని పైన బాల్కనీ గ్రిల్ నుండి పడిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 

ఇది గమనించిన వెంటనే చిన్నారిని 71వ సెక్టార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని తెలిపారు.ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.