ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ 19 ఏళ్ల యువకుడు అరెస్ట్
Palghar: పాల్ఘర్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వంజరవాడకు చెందిన నిందితుడు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Five-year-old girl raped by minor: దేశంలో మహిళలపై హింస, దాడులు, వరుస లైంగికదాడి ఘటనలు వెలుగులోకి వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడు ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఏవరూ లేని సమయంలో నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వంజరవాడకు చెందిన నిందితుడు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. "వంజరవాడకు చెందిన నిందితుడు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడనీ, ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని" బోయిసర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే, బాలిక తనపై జరిగిన లైంగికదాడిని గురించి తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం లైంగికదాడి గురించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకునీ, భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్స్) నిబంధనల ప్రకారం 19 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు.
పదమూడేండ్ల బాలికపై..
ముంబయిలోని ఒక పాఠశాలలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 3 ఏళ్ల బాలికపై పాఠశాల ఆవరణలోనే ఇద్దరు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. ముంబయి పోలీసులు శుక్రవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముంబయిలోని మాతుంగా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. నిందితులు మైనర్ బాలురు బాలిక క్లాస్ మేట్స్, వారంతా కూడా 8వ తరగతి చదువుతున్నారని సమాచారం.
తోటి క్లాస్ మేట్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాలికపై ఆమె ఇద్దరు క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడ్డారని మాతుంగా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటను గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (డి), పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని డోంగ్రి కరెక్షనల్ హోమ్ (జువెనైల్ హోమ్) కు పంపారు.
ముంబయిలోనూ..
ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 42 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చిత్రహింసలను గురిచేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... ముగ్గురు నిందితులు ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో ఆమె మీద దాడి చేసి, సిగరెట్‌తో ఆమె ప్రయివేటు భాగాలపై కాల్చారు. ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు అధికారి ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున కుర్లాలో జరిగిందని, నిందితులు, బాధితురాలు ఒకే ప్రాంతంలో ఉండేవారేనని పోలీసులు తెలిపారు. "ఆమె ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడంతోపాటు అసహజ శృంగారానికి కూడా పాల్పడ్డారు. ఆమె ప్రయివేటు భాగాలను సిగరెట్‌తో కాల్చారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపితే ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని బెదిరించారు" అని పోలీసులు తెలిపారు.