రైల్వే స్టేషన్ లలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే  ప్రాణాలకే ముప్పు. ఓ యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయాడు. అందుకు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా వ్యహరించాలి. రైలు ఎక్కే సమయంలో గానీ, రైలు దిగే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులో కూడా పట్టాలు దాటే ప్రయత్నం చేయకూడదు. అలాగే.. ప్లాట్ ఫామ్ ల మీద కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన ప్రాణాలకే ముప్పు. తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ పై ఉన్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకెళ్తే.. ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. మయాంక్ అనిల్ శర్మ (17) అనే యువకుడు ప్లాట్‌ఫారమ్‌పై ట్రాక్ దగ్గర నిలబడి చేతులు కడుక్కుంటాడు.ఇంతలో రైలు వేగంగా దూసుకవచ్చింది. ఆ యువకుడ్ని రైలు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూన్ 17 చోటుచేసుకుంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదానికి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలో ఇద్దరు యువకులను చూడవచ్చు.. వారు ప్లాట్‌ఫారమ్‌పై టిఫిన్ తిని.. ట్రాక్‌లపై ట్రాక్ వైపు చేతులు కడుక్కుంటారు. తొలుత ఓ యువకుడు చేతులు కడుక్కుని నీళ్లు తాగడం మొదలు పెట్టాడు. ఇంతలో మరొక కుర్రాడు అతని నుండి బాటిల్ తీసుకొని చేతులు కడుక్కోవడం ప్రారంభించాడు. అంతలో రైల్ వేగంగా దూసుకవచ్చింది. రైలు ఇంజిన్ ఆ యువకుడికి బలంగా ఢీకొట్టడంతో అతను రైలు నుండి చాలా దూరం విసిరివేయబడ్డాడు. తర్వాత అతడు ఎటువంటి కదలికలు చేయలేదు. దీంతో అక్కడి సెక్యూరిటీ వెంటనే ఆ కుర్రాన్ని కాన్డివాలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

మృతుడు మయాంక్ శర్మ (16 సంవత్సరాలు)గా గుర్తించారు. సమాచారం మేరకు స్టేషన్‌లోని 3వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఉన్నాడు. ఇక్కడ అతను తన స్నేహితుడితో కలిసి టిఫిన్ నుండి భోజనం చేసాడు. ఆ తర్వాత సీసాలోని నీళ్లు తాగుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అక్కడికక్కడే ఉన్న అతని స్నేహితుడు కూడా గాయపడ్డాడు. అతను చికిత్స పొందుతున్నాడు. మొత్తానికి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. అందుకే రైల్వే స్టేషన్ లలో చాలా జాగ్రత్తతగా ఉండాలని అధికారులు సూచిస్తారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇలా భారీ మూల్యం చెల్లించాల్సిందే. 

Scroll to load tweet…