Jajpur: జాజ్‌పూర్ జిల్లాలో మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన 11 ఏళ్ల బాలిక తల్లి బలిచంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 

15-year-old boy rapes minor: ఒక మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన గురించి 11 ఏళ్ల బాలిక తల్లి బలిచంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం తన కూతురు ఇంటి ముందు పక్కింటి అబ్బాయితో ఆడుకుంటోంది. ఆ తర్వాత ఆ బాలుడు ఆమెను పిలిచి మేడపైకి తీసుకెళ్లి బలవంతం చేశాడు. అయితే, ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక తన ప్ర‌యివేటు భాగంలో నొప్పి గురించి తల్లికి చెప్పింది. ఆ తర్వాత ఆ బాలుడు తనతో కలిసి పైకప్పుపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది.

బాలికను వెంటనే చికిత్స నిమిత్తం బరాచానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాలిక తల్లి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక‌పై లైంగిక‌దాడి పాల్ప‌డిన అనంత‌రం నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలుడు ఇంటి నుంచి పారిపోయాడ‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదుచేసుకున్నామ‌నీ, బాలుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని బలిచంద్రాపూర్ ఇన్ స్పెక్టర్ ఇన్ చార్జి రమాకాంత ముదులి తెలిపారు.