వామ్మో.. కాన్పూర్ యూనివర్సిటీలో మేకను మింగేసిన కొండచిలువ.. వైరల్ వీడియో !
Kanpur: కాన్పూర్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో 15 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral video: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో మంగళవారం 15 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. మేకను మింగిన తర్వాత అది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్థానికులకు కొండచిలువ కనిపించింది.
కొండ చిలువకు సంబంధించిన వీడియో ఇదిగో..
యూనివర్సిటీ డెయిరీ విభాగం సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దానిని చూసిన వారి అరుపులతో కలవరపడిన తర్వాత, కొండచిలువ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది. సంబంధిత విభాగం చైర్మన్ వేదప్రకాష్ వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌ఓ), జూ ఇన్‌ఛార్జ్ వెటర్నరీ అధికారి అనురాగ్ సింగ్ లకు కొండచిలువకు సంబంధించిన సమాచారం అందించారు. కొండచిలువను రక్షించాల్సిందిగా కోరారు.
అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారుల బృందం.. అరగంటపాటు శ్రమించి.. కొండచిలువను పట్టుకుని జూలోని స్నేక్‌హౌస్‌లో వదిలిపెట్టింది. అటవీ శాఖ బృందం ఘటనాస్థలికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందనీ, అప్పటి వరకు కొండచిలువను చూసేందుకు గుమికూడిన ప్రజలు రోడ్డుపైనే ఉండిపోయారని యూనివర్సిటీ వీసీ డీఆర్ సింగ్ తెలిపారు. అటవీ శాఖ బృందం కొండచిలువను రక్షించి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు.
స్విమ్మింగ్ పూల్ లో జాగ్వర్..
ఒక స్విమ్మింగ్ పూల్ లో జాగ్వర్ స్నానం చేస్తున్న ఒక సూపర్ క్యూట్ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. @africasafariplanet అనే హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ క్లిప్‌ను షేర్ చేసింది. దీనికి 400k కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. సంబంధిత వీడియో దృశ్యాల్లోజాగ్వర్ పూల్‌లో స్వానం చేస్తూ.. తన సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించింది. పులి స్నానం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ దానిని ముద్దుగా చూడటం.. దాని శరీరంపై నీళ్తు పొయడం.. చేతితో రుద్దడం కనిపించింది. ఇక ఆ జాగ్వర్ స్నానాన్ని ఆస్వాదిస్తూ దాని తల, శరీరం చుట్టూ తిరగడం ప్రారంభించే విధానం మనోహరంగా ఉంటుంది. చివరకు పూర్తిగా కొలనులోకి దిగి, హాయిగా స్నానం చేయడం కనిపించింది.
ఈ వీడియోకు 23 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు 400k వ్యూస్ ను సంపాదించుకుంది. అలాగే, విభిన్నమైన కామెంట్లు కూడా వస్తున్నాయి.