Asianet News TeluguAsianet News Telugu

పన్నెండేళ్ల విద్యార్థికి కార్డియాక్ అరెస్ట్.. స్కూలు బస్సులోనే కుప్పకూలి, మృతి..

మధ్యప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోనే ఓ 12యేళ్ల విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందాడు. 

A 12-year-old student died after collapsing in the school bus due to cardiac arrest in Madhya Pradesh
Author
First Published Dec 17, 2022, 7:34 AM IST

మధ్యప్రదేశ్ : గుండెపోటుతో చిన్నారులు చనిపోతున్న ఘటనలు ఇటీవల భయాందోళనలు కలిగిస్తోంది. అలాంటి ఓ దిగ్భ్రాంతికర  ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలుడికి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూల్ బస్సులో పాఠశాలకు వెళుతున్న విద్యార్థికి కార్డియాక్ అరెస్ట్ అయింది. దీంతో బస్సులోనే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన గురువారం మధ్య ప్రదేశ్ లోని భింద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భింద్ ప్రాంతానికి చెందిన మనీష్ జాటవ్ స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో  4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్కూల్లో మనీష్ తన సోదరుడితో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత రెండు గంటలకే స్కూలు పూర్తయింది.  అందరి పిల్లల్లాగే ఇంటికి వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. స్కూల్ బస్సు ఎక్కుతూనే ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్కూల్ బస్సు డ్రైవర్.. స్కూల్ మేనేజ్మెంట్ కు సమాచారం అందించాడు. ఇంకా బస్సు స్కూల్ లోనే ఉండడంతో.. బయలుదేరక పోవడంతో వారు వెంటనే బస్సు దగ్గరికి చేరుకున్నారు. 

మనీష్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సరికి మహేష్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ‘హాస్పిటల్కు వచ్చేసరికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నాడి అందడం లేదు.  సిపిఆర్ చేసినా మనీష్ ని కాపాడలేకపోయాం. చిన్నారికి ప్రాథమిక లక్షణాలు చూస్తుంటే.. కార్డియాక్ అరెస్ట్ అయినట్లుగా అనిపిస్తుంది’ అని వైద్యులు తెలిపారు. కోవిడ్-19 తర్వాత ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి అని డాక్టర్లు అంటున్నారు. అయితే, ఇంత చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్ కావడం మధ్య ప్రదేశ్ లో ఇదే మొదటి కేసు అయి ఉంటుందని డాక్టర్లు అన్నారు. చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతూ బోరున విలపించాడు. 

ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని పీఎం : మోడీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే అక్టోబర్ లో తెలంగాణలోని సిరిసిల్లాలో చోటు చేసుకుంది. దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుని తెల్లారి పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి అచేతనంగా మారి, కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లజిల్లా వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత-సతీష్ దంపతులకు కౌశిక్ (9)కొడుకు, కుమార్తె  మేఘన ఉన్నారు. కౌశిక్ బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నాడు. 

రోజూలాగే ఆ రోజు కూడా మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిల్చున్నాడు కౌశిక్. ఆ సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  బుర్ర కౌశిక్ (8) మూడో తరగతి విద్యార్థి. కౌశిక్  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలిచి ఉన్న కౌశిక్  హఠాత్తుగా కిందపడిపోయాడు. అది గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు వాహనంలోని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కొంతకాలంగా  ఫిట్స్, గుండె సంబంధిత (హార్ట్ వీక్) వ్యాధితో  చిన్నారి బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్  మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios