సారాంశం

బాలనేరస్తులైన ఇద్దరు విద్యార్థులు ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. దీంతో ఆ విద్యార్థి మృతి చెందాడు.

ఒడిశా : ఇయర్‌ఫోన్‌ ఇవ్వలేదని ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని దారుణంగా హతమార్చారు తోటి విద్యార్థులు. ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలాలో వెలుగు చూసింది. ఇయర్‌ఫోన్‌ విషయంలో గొడవపడి 9వ తరగతి విద్యార్థిని అతని ఇద్దరు స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, మంగళవారం 15 ఏళ్ల వయస్సు గల బాలుడి మృతదేహం హెకెట్ రోడ్‌లో గుబురు పొదల్లో కనిపించింది. బాధితుడు ఆదివారం నుండి కనిపించకుండా పోయాడు.

ఆదివారం సాయంత్రం నుంచి విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆర్‌ఎన్‌ పాలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు మీడియాకు తెలిపారు. 9వ తరగతి విద్యార్థి తండ్రి ఈ సంఘటన గురించి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలనేరస్థుల ప్రమేయం దీంట్లో ఉందా అనే విషయం గురించి వివరాలు సేకరించారు.

వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నానంటూ తల్లికి మెసేజ్.. 35వ అంతస్తు నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

పాన్‌పోష్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) ఉపాసన పాధి మాట్లాడుతూ తల్లిదండ్రులు.. తమ కొడుకు ఇద్దరు స్నేహితులతో సమయం గడిపేవారని ఆధారాలు అందించారని, అది వారికి సహాయపడిందని చెప్పారు. ఇద్దరితో పాటు, నేరాన్ని చూసిన మరో బాలుడిని స్టేట్‌మెంట్‌ల నమోదు కోసం అదుపులోకి తీసుకున్నారు.

ఇయర్‌ఫోన్‌ను షేర్ చేసుకునే విషయంలో యువకులు తమ సైకిళ్లపై గొడవ పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఇద్దరు నిందితులు బాధితుడిపై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

బాధితుడిని నువా బస్తీకి చెందిన రుద్ర నారాయణ్ పాధిగా గుర్తించారు. పయనీర్ ప్రకారం, అతను రూర్కెలాలోని సివిల్ టౌన్‌షిప్‌లోని డెవలప్‌డ్ ఏరియా హైస్కూల్ విద్యార్థి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.