కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కురు వృద్ధుడు, 92 ఏళ్ల శామనూరు శివశంకరప్ప నయా రికార్డు క్రియేట్ చేశారు. లేటు వయస్సులో వరుసగా ఐదోసారి విజయం సాధించారు. దావణగెరె దక్షిణ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఆయన తాజాగా ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తారుమారు చేస్తూ.. స్పష్టమైన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 136 స్థానాల్లో గెలుపు బావుటను ఎగరవేసింది. కోస్టల్ కర్ణాటక, బెంగళూరు పరిసరాల్లో మినహా మిగతా చోట్ల బీజేపీ చతికిలపడింది. కేవలం 64 సీట్లతోనే సరిపెట్టుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి స్పష్టమైన మెజార్టీతో అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. అయితే.. కౌన్ బనేగా సీఎం అనే అంశం చర్చనీయంగా మారింది.
ఇదిలాఉంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కురు వృద్ధుడు( 91 ఏళ్ల) షామనూరు శివశంకరప్ప రికార్డు క్రియేట్ చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన ఈ ఎన్నికల్లో ఎవ్వరి ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని అందుకున్నారు. తన గెలుపుతో విమర్శకులు నోళ్లు మూయించారు. 92 ఏళ్ల వయస్సులో ఆయనకు టిక్కెట్ ఇవ్వడమేంటనీ, ఆయన గెలుస్తారా? అసలు ప్రచారమైనా చేసిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడమేంటనీ అటు పార్టీలో.. మరోవైపు బయట కూడా విమర్శలు వచ్చాయి. కానీ, ఆ విమర్శలను తిప్పి కొడుతూ.. మరోసారి విక్టరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు శివశంకరప్ప. తాను కూడా రేసు గుర్రానే అని చాటి చెప్పారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు షామనూరు శివశంకరప్ప ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మాజీ లోక్‌సభ సభ్యుడు, దావణగెరె సౌత్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగారు. 91 ఏళ్ల వయసులో షామనూరు శివశంకరప్ప దావణగెరె సౌత్ నుంచి పోటీ చేసి వరుసగా ఆరోసారి గెలిచి చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థిపై లింగాయత్ నేత శామనూరు శివశంకరప్ప విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్‌కు 56,410 ఓట్లు వచ్చాయి. 27,888 ఓట్ల మెజార్టీతో ఆయన విజయాన్ని అందుకున్నారు. ఇక.. అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు శివశంకరప్ప.. ఆయన దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం.
91 ఏళ్ల వయసులో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినప్పుడు శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, ఇంకా ఏం కావాలి? అలాగే పరుగెత్తే గుర్రాలను ఎప్పుడూ రేసుకు ఎంపిక చేస్తారని చెప్పాడు. నేను అలాంటి గుర్రాన్ని. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. అతడు అన్న విధంగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. శివశంకరప్ప పొలిటికల్ ఎంట్రీ కూడా కాస్తా లేట్ వయస్సులోనే అయ్యింది. 1994లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన దావణ గెరె మున్సిపల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి రికార్డు సృష్టించారు శివశంకరప్ప.
