రిపబ్లిక్ డే వేడుకలకు ముందు భారీ ఉగ్రవాద కుట్రను ఛేదించారు పోలీసులు. ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో బంధాలున్న 9 మందిని  మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఉగ్రకదలికలపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్వాడ్‌ (ఏటీఎస్) నిఘా పెట్టింది.

దీనిలో భాగంగా ముంబై, పుణేల్లో ఐఎస్ మద్ధతుదారులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందింది. వీరిని పట్టుకోవడానికి ఏటీఎస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ క్రమంలో ముంబై, థానే, ఔరంగాబాద్ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఒక 17 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి రసాయనాలు, పేలుడు పదార్థాలు, సెల్‌ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, సిమ్‌కార్డులు, యాసిడ్ బాటిల్స్, పదునైన కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.