Coronavirus: ముంబ‌యిలో 89 శాతం ఒమిక్రాన్‌ కేసులే..

Coronavirus: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్నది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇక్క‌డ న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో అత్య‌ధికం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేన‌ని అధికారులు పేర్కొంటున్నారు. డెల్టా వేరియంట్ కేసులు సైతం ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. ఈ రెండు వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వే కావ‌డంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 
 

89 percent samples from Mumbai show presence of Omicron

Coronavirus: యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే అన్ని దేశాల‌కు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ఇదివ‌ర‌కు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్ర‌స్తుతం దాని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు లక్ష‌ల్లో న‌మోదుకావ‌డం కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇక్క‌డ న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో అత్య‌ధికం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేన‌ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు సైతం ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. ఈ రెండు వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వే కావ‌డంతో స్థానికంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 

ముంబ‌యిలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా కొత్త వేరియంటుకు సంబంధించినవేనని బృహిన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు వెల్ల‌డించారు. తాజా రౌండ్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన న‌మునాల్లో ముంబ‌యికి చెందిన‌వి 280 శాంపిళ్ల‌ను పరిశీలింగా అందులో అత్యంత వేంగంగా వ్యాపిస్తున్న 89 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులే ఉన్నాయ‌ని తెలిపారు. మున్సిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మాట్లాడుతూ.. ముంబ‌యిలో మొత్తం 373 నమూనాలను జీనోమ్ సిక్వెన్సింగ్ చేసిన వాటిలో 280 బీఎంసీ పరిధికి సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు. ఈ 280 నమనాల్లో 89 శాతం లేదా 248 నమూనాల్లో ఒమిక్రాన్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మరో 8 శాతం లేదా 21 నమూనాల్లో డెల్టా వేరియంట్స్, , మిగిలిన మూడు శాతం లేదా 11 నమూనాల్లో ఇతర క‌రోనా ల‌క్ష‌ణాల‌ను ఉన్నాయ‌న‌ని తెలిపారు. 

2021 డిసెంబర్ చివరి వారంలో నిర్వహించిన ఏడవ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పూర్తి విరుద్ధంగా ప్ర‌స్తుత ప‌ర‌స్థితులు ఉన్నాయి. అప్పుడు ప‌రీక్షించిన 282 నమూనాలలో, 156 నమూనాలు (55%) ఓమిక్రాన్ వేరియంట్ కేసులు గుర్తించారు.  89 నమూనాలు (32%) డెల్టా వెరియంట్‌, 37 (13%) ఇత‌ర క‌రోనా ర‌కాలు ఉన్న‌ట్టు గుర్తించారు. డిసెంబర్ రెండవ వారంలో నిర్వహించిన ఆరవ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో, కేవలం 2% నమూనాలు మాత్రమే ఓమిక్రాన్ వేరియంట్‌ను కలిగి ఉన్నాయి. “గత ఏడాది డిసెంబర్ చివరి నుంచి ముంబ‌యిలో ఒమిక్రాన్ కేసులు పెర‌గ‌డాన్ని గుణాంకాలు సూచిస్తున్నాయి.  దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయ‌ని తెలుస్తోంది”అని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదనపు కమిషనర్ సురేష్ అన్నారు.

BMC నుండి వచ్చిన క‌రోనా డేటా ప్రకారం, 280 నమూనాలలో, 96 లేదా 34% మంది 21-40 ఏళ్ల వయస్సులో ఉన్న రోగులు, 79 లేదా 28% మంది 41-60 ఏళ్ల వయస్సులోని వ్య‌క్తులు ఉన్నారు. అలాగే, 61-80 ఏళ్లలో 69 లేదా 25% ఉన్నారు. వీరిలో టీకాలు తీసుకోని వారు 99 మంది వుండ‌గా, వారిలో 76 మంది ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. 12 మందికి ఆక్సిజన్ అవసరం కాగా, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios