రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడు రాజ్ భవన్ లో 84 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.  కరోనా సోకినవారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. 
 

84 staff working at Tamil Nadu Raj Bhavan test positive for Covid-19

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడు రాజ్ భవన్ లో 84 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.  కరోనా సోకినవారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. 

రాజ్ భవన్ లో 147 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కరోనా సోకడంతో రాజ్ భవన్ ను శానిటేషన్ చేశారు. కరోనా సోకిన ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని  నలుగురు మంత్రులు, 17 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. 

also read:24 గంటల్లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,38,635కి చేరిక

చెన్నైలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 1171 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో తిరువళ్లూరు నిలిచింది. ఇక్కడ 430 కేసులు, రాణిపేటలో 414,విరుధనగర్ లో 363, తుత్తుకూడిలో 327, కాంచీపురంలో 325 కేసులు రికార్డయ్యాయి.

బుధవారం నాడు ఒక్కరోజే రాష్ట్రంలో 5,849 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,86,492కి కరోనా కేసులు చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 522 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3144కి చేరుకొన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios