ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వైరస్ తో సతమతమౌతున్నారు. ఈ క్రమంలో ఓ 82ఏళ్ల బామ్మ ఆ వైరస్ ని జయించింది. వైరస్ సోకి ఆస్పత్రికి చేరిన బామ్మ... ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుంది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Also Read ఇండియాలో ఐదు వేలు దాటిన పాజిటివ్ కేసులు: మృతుల సంఖ్య 166...

పూర్తి వివరాల్లోకి వెళితే... మన దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా మహారాష్ట్రలోనే విజృంభించింది. కాగా.. అక్కడ వైరస్ సోకినవారిలో అత్యంత ఎక్కువ వయసు ఉన్న ఈ 82ఏళ్ల బామ్మ కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల కేరళలో ఇద్దరు వృద్ధ దంపతులు చికిత్స తర్వాత కోలుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇటలీలో కూడా 103ఏళ్ల బామ్మ వైరస్ తర్వాత కోలుకుంది.

అయితే.. మహారాష్ట్రలో మాత్రం తొలిసారి గా ఓ వృద్ధురాలు కోలుకుంది. కాగా.. సదురు బామ్మ కుమారుడు మాట్లాడుతూ.. వాళ్ల అమ్మగారు కొద్ది రోజుల క్రితం గుజరాత్ వెళ్లి వచ్చారని చెప్పారు. వచ్చినప్పటి నుంచి ఆమెలో కొద్దిగా లక్షణాలు కనపడటంతో.. వెంటనే ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. వెంటనే కోలుకోవడం తమకు సంతోషంగా ఉందని చెప్పారు.

ఆమెకు చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ.. ఆమెకు విల్ పవర్ చాలా ఎక్కువగా ఉందని.. అందుకే త్వరగా కోలుకోగలిగిందని పేర్కొన్నారు.