యూపీలో దారుణం.. మాయమాటలు చెప్పి 8 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగికదాడి..
కాన్పూర్‌లో 8 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అసభ్యకర పనులు చేస్తూ బాధితురాలి తండ్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

యూపీలోని కాన్పూర్‌లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగు చూసింది. కాన్పూర్‌లో 8 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల పూజారి లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం బాధితురాలి తండ్రి నిందితుడైన పూజారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన తర్వాత స్థానికులు పూజారిని కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని వైద్యం కోసం తరలించారు. అదే సమయంలో పోలీసులు నిందితులపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనశ్యామ్ దాస్ యూపీలోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే పక్కన ఉన్న దేవాలయ సముదాయంలో నివసిస్తున్నాడు. ఘనశ్యామ్ దాస్ పూజలు చేసి ఆలయాన్ని చూసుకుంటారు. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆలయ ప్రాంగణం పక్కనే గుడిసె వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఈ క్రమంలో ఆ 80 ఏండ్ల పూజారి.. ఓ 8 ఏండ్ల చిన్నారిపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి డబ్బులు ఆశ చూపించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. శనివారం మధ్యాహ్నం 8 ఏళ్ల కూతురు ఇంట్లో లేకపోవడంతో ..ఆ చిన్నారిని వెతుకుతూ.. ఘనశ్యామ్ దాస్ ఇంటికి చేరుకున్నాడు. ఆ ముసలోడు తన కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. ఆ పని చూసిన ఆ బాలిక తండ్రి షాక్ అయ్యాను. తన కూతురుని బయటికి పిలువగా..ఆ ముసలోడు వెంటనే ఆ చిన్నారికి డ్రెస్ వేసి, గేటు తెరిచాడు.
ఆ విషయమై ఆ బాలికను ఆరా తీయగా.. గత 3-4 రోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బర్రా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు.నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనశ్యామదాస్ గంజాయి అమ్ముతూ ఖర్చులు సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు .. తాను, తన భార్య కూలిపనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని బాధితురాలి తండ్రి చెబుతున్నాడు. తాను, తన భార్యతో కలిసి కూలి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. తన కుమార్తెను ఆ పూజరి ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని ఆరోపించారు. ఏసీపీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 8 ఏళ్ల బాలికతో ఘనశ్యామ్ దాస్ అనే వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు బాలిక బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తహ్రీర్ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో పాటు బాలికను వైద్యం కోసం తరలించారు.