పాఠశాలలో దారుణం.. ఎనిమిది యేండ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసుల వాహనాలకు నిప్పు..
రాయగడ జిల్లాకు చెందిన 3వ తరగతి విద్యార్థినపై ఆ పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్న కామాంధుడు కన్నేశాడు. మాయ మాటలు చెప్పి.. ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, తల్లిదండ్రులు ఆ కామాంధుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై కూడా సైతం విరుచుకపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల వాహనానికి నిప్పంటించారు.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమల్లోకి వచ్చిన కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట మహిళలపై, చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాల్లా చెలరేగిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిది యేండ్ల చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు. మాయ మాటలు చెప్పి చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసు వాహనానికి నిప్పంటించారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. రాయగడ జిల్లాకు చెందిన 3వ తరగతి విద్యార్థినపై ఆ పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్న కామాంధుడు కన్నేశాడు. మాయ మాటలు చెప్పి.. ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, తల్లిదండ్రులు ఆ కామాంధుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై కూడా సైతం విరుచుకపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల వాహనానికి నిప్పంటించారు.
దంగసిల్ గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ నిందితుడ్ని అదుపులోకి తీసుకుని తీసుకెళ్తుండగా.. స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు జీపును కూడా ధ్వంసం చేశారు. ఈ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ దాడికి పాల్పడిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాయగడ పోలీస్ సూపరింటెండెంట్ వివేకానంద శర్మ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారి తెలిపారు.
అసలేం జరిగిందంటే..
దంగసిల్ గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్న కామాంధుడు శుక్రవారం సాయంత్రం సమయంలో బాధిత చిన్నారిని పాఠశాలలోని ఖాళీ గదికి తనతో పాటు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో పాటు నొప్పితో ఏడుస్తూ ఉండడంతో బాలిక స్నేహితులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆమె తల్లికి సమాచారం అందించారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన స్థానికులు దొంగసిల్‌లోని పోలీస్ అవుట్‌పోస్టు ఎదుట గుమిగూడి నిందితులను తమకు అప్పగించాలని అధికారులను డిమాండ్ చేశారు. పోలీసులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన గుంపు పోలీసు వ్యాన్‌ను తగలబెట్టి, జీపును ధ్వంసం చేసింది.
పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉన్నందున రాయగడ అదనపు పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలో ప్రత్యేక భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పాఠశాల సమీపంలో క్యాంప్ చేస్తున్నాయని అధికారి తెలిపారు. నిందితుడు ప్యూన్‌ను అదుపులోకి తీసుకున్నామనీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ జారీ చేసినట్లు అధికారి తెలిపారు.
ఈ ఘటనపై రాయగడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్ బిదులత హుయికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యుల బృందంతో కలిసి రాయగడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని, ఆమె తల్లిని ఆమె కలిశారు. వారికి న్యాయం చేస్తామని బృందం హామీ ఇచ్చింది.