ఓ బాలిక మీద పగతో... ఆమె చిన్నారి తమ్ముడిని బాలుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

సౌత్ ఢిల్లీకి చెందిన భార్యభర్తలు తమ కుమార్తె, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వారి ఇంట్లో మరో కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా.. ఇంటి యజమానికి కుమార్తె.. ఇటీవల ఆడుకుంటూ.. అద్దెకు నివాసం ఉంటున్న వారి చిన్న కుమారుడిని పొరపాటును కిందకు నెట్టేసింది. ఈ క్రమంలో బాలుడు గాయపడ్డాడు. దీంతో.. ఆ బాలికపై బాలుడి అన్నయ్య పగ పెంచుకున్నాడు. తన తమ్ముడిని కిందపడేసి రక్తం రావడానికి కారణం అయ్యిందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో.. శనివారం రాత్రి సమయంలో... బాలిక, ఆమె తల్లిదండ్రులు వారి కుమారుడు నిద్రపోతుండగా... ఈ బాలుడు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక తమ్ముడిని కిడ్నాప్ చేసి.. వారు నివసించే ఇంటికి సమీపంలో తీవ్రంగా కొట్టి సంపులో పడేశాడు. దీంతో బాలుడు చనిపోయాడు.

బాలుడు రాత్రి నుంచి కనిపించడం లేదని చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వారు బాలుడు కోసం గాలించగా..శవమమై తేలాడు. కాగా.. ఈ బాబుతోపాటు పక్కింటి బాలుడు కూడా కనిపించకపోవడంతో అనుమానం కలిగింది. అతనిని గాలించి పట్టుకోగా.. నేరం తానే చేసినట్లు అంగీకరించాడు.
 
హత్య చేసిన బాలుడి వయసు 8 సంవత్సరాలు.. చనిపోయిన బాలుడి వయసు సంవత్సరన్నర  కావడం గమనార్హం. బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డ్ కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.