Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : 8 యేళ్ల చిన్నారితో కరోనా పేషంట్ల టాయిలెట్లు శుభ్రం చేయించి.. !!

మహారాష్ట్రలో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల చిన్నారితో కరోనా పేషంట్ల టాయిలెట్లను కడిగించాడో వ్యక్తి. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్ర, బుల్దానా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. ఇక్కడి ఒక కోవిడ్ సెంటర్‌లో కరోనా రోగుల మరుగుదొడ్డిని శుభ్రం చేయవలసి వచ్చింది. సెంటర్ హెడ్ ఆ చిన్నారిని బెదిరించి, కొట్టి టాయిలెట్ ను కడిగించాడు.

8-year-old child made to clean toilet at Covid isolation centre in Maharashtra - bsb
Author
Hyderabad, First Published Jun 3, 2021, 3:00 PM IST

మహారాష్ట్రలో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల చిన్నారితో కరోనా పేషంట్ల టాయిలెట్లను కడిగించాడో వ్యక్తి. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్ర, బుల్దానా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. ఇక్కడి ఒక కోవిడ్ సెంటర్‌లో కరోనా రోగుల మరుగుదొడ్డిని శుభ్రం చేయవలసి వచ్చింది. సెంటర్ హెడ్ ఆ చిన్నారిని బెదిరించి, కొట్టి టాయిలెట్ ను కడిగించాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అతని మీద చర్యలు తీసుకుంది. వెంటనే అతన్ని సస్పెండ్ చేసింది. 

బుల్ధానా జిల్లాలోని సంగ్రాంపూర్ తహసీల్ లోని మరోడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ  కోవిడ్ కేర్ సెంటర్ ను గ్రామంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేశారు. అయితే సెంటర్ లోని టాయిలెట్లు శుభ్రం చేయడానికి పారిశుధ్య కార్మికులు ముందుకు రాలేదు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సెంటర్ నిర్వహణ ఎలా ఉందో తనిఖీ చేయడానికి పై అధికారులు సందర్శించనున్నారు. 

దీంతో వారి ముందు ఇంప్రెషన్ కొట్టేయాలని ఆ సెంటర్ నిర్వాహకుడు, గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు తెలిపారు. దీనిమీద ఆ చిన్నారి మాట్లాడుతూ.. మరుగుదొడ్డి శుభ్రం చేయడానికి ఎవ్వరూ రాలేదని నన్ను కడగమన్నాడు. నేను ఒప్పుకోకపోతే బెదిరించాడు, కొడతానని కర్రపట్టుకున్నాడు. కడిగిన తరువాత రూ.50 ఇచ్చాడు... అని చెప్పుకొచ్చాడు. 

ఈ వీడియోలో ఆ చిన్నారి టాయిలెట్ శుభ్రం చేస్తుంటే.. అతను మరాఠీలో సూచనలివ్వడం కూడా కనిపించింది. అయితే ఇది చాలా అవమానకరమైన, హేయమైన చర్య అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వీడియో మహారాష్ట్ర లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరును అందరూ తప్పుపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios