Asianet News TeluguAsianet News Telugu

బోరుబావిలో ఎనిమిదేండ్ల బాలుడు.. 84 గంటల పాటు మృత్యుతో పోరాటం.. చివరికి...

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 55 అడుగుల లోతున్న బోరుబావిలో చిక్కుకున్న ఎనిమిదేళ్ల బాలుడిని రక్షించడానికి దాదాపు 84 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావిలో నుంచి బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ బాలుడి ప్రాణాలకు కాపాడలేకపోయారు.  

8-year-old boy who fell into 400-ft borewell in MP dies
Author
First Published Dec 10, 2022, 9:48 AM IST

మూసివేయకుండా ఉంచుతున్న బోరుబావులు చిన్నారుల పాలిట మృత్యు కుహరాలు మారుతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట చిన్నారులు బోరుబావుల్లో ప్రమాదవశాత్తూ పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా..  మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 55 అడుగుల లోతున్న బోరుబావిలో చిక్కుకున్న ఎనిమిదేళ్ల బాలుడిని రక్షించడానికి దాదాపు 84 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావిలో నుంచి బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ బాలుడి ప్రాణాలకు కాపాడలేకపోయారు.  

వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండ్వీకి చెందిన సునీల్ సాహు ఎనిమిదేళ్ల కుమారుడు తన్మయ్ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత బోరుబావిలో పడిపోయాడు.   సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఈఆర్‌ఎఫ్‌ బృందం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 50 అడుగుల లోతులో తన్మయ్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.

బోర్‌వెల్‌కు దాదాపు 30 అడుగుల దూరంలో బుల్‌డోజర్‌, పొక్లెన్‌ మిషన్‌తో సొరంగం తవ్వడం ప్రారంభించారు. పొక్లెన్ యంత్రంతో సుమారు 50 అడుగుల లోతు వరకు తవ్వి, ఆ తర్వాత చిక్కుకున్న చిన్నారి వరకు టన్నెలింగ్ పనులు చేసి బయటకు తీశారు. బోరుబావిలో నుంచి బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ బాలుడి ప్రాణాలకు కాపాడలేకపోయారు.  


తన్మయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సివిల్ సర్జన్ అశోక్ బరంగ సమక్షంలో వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. బోరుబావిలోంచి బయటకు తీసినప్పుడు కొడుకు ముఖం కూడా చూపించలేదని తన్మయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మంగళవారం సాయంత్రం మాండ్వి గ్రామంలో బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల తన్మయ్ సాహును రక్షించేందుకు గత 84 గంటలుగా యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి బోర్‌వెల్‌కు సమాంతరంగా 46 అడుగుల గొయ్యిని తవ్వి సుమారు తొమ్మిది అడుగుల పొడవైన సొరంగాన్ని NDRF మరియు SDERF బృందం తీసింది. 

బాధకరం: శివరాజ్ సింగ్ చౌహాన్ 
 
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. తన ట్వీట్‌లో ..'బేతుల్‌లోని అత్నర్ బ్లాక్‌లోని మాండ్వి గ్రామంలో 8 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోవడం బాధాకరమని, అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను స్థానిక పరిపాలనను ఆదేశించాను. నేను పరిపాలనతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. చిన్నారిని సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌ ప్రయత్నిస్తోంది. అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios