Asianet News TeluguAsianet News Telugu

వీక్లీ మార్కెట్ లో నమాజ్ చేసినందుకు 8 మంది అరెస్టు.. ఉత్త‌రాఖండ్ లో ఘ‌ట‌న

లులు మాల్ లో నమాజ్ వివాదం చల్లారక ముందే అలాంటి ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. హరిద్వారాలోని ఓ వీక్లీ మార్కెల్ లో 8 మంది బహిరంగంగా నమాజ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

8 people arrested for offering namaz in weekly market.. Incident in Uttarakhand
Author
Haridwar, First Published Jul 22, 2022, 3:19 PM IST

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని వీక్లీ మార్కెట్ లో సామూహికంగా ప‌లువురు ముస్లింలు న‌మాజ్ చేశారు. దీంతో వారిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో 8 మంది వ్య‌క్తులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లులు మాల్ లో ‘నమాజ్’ వివాదం చెలరేగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇది చోటు చేసుకుంది. 

నిందితుల‌ను అరెస్టు చేసిన అనంత‌రం పోలీసులు వారిని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కోర్టు కు త‌ర‌లించారు. అయితే వారికి కోర్టు వారికి బెయిల్  మంజూరు చేసింద‌ని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు శివాలిక్‌లో నిజాం (22), నాసిమ్ (52), సజ్జాద్ అహ్మద్ (50), ముర్సలిన్ (38), అష్రఫ్ (45), అస్గర్ (37), ముస్తఫా (35), ఇక్రమ్ (47)లను అరెస్టు చేశారు.

కేరళలో మరో మంకీపాక్స్ కేసు: మూడుకి చేరిన కేసులు

నగర్ కాలనీలో గురువారం జ‌రిగే వారపు మార్కెట్‌లో సాయంత్రం పూట ఇది చోటు చేసుకుంద‌ని పోలీసు సూపరింటెండెంట్ (నగరం) స్వతంత్ర కుమార్ తెలిపారు. వారిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 (ఏదైనా గుర్తించదగిన నేరం చేసేలా డిజైన్) న‌మోదు చేసి అరెస్టు చేశామ‌ని తెలిపారు. అనంత‌రం వారిని SDM కోర్టులో హాజరుపరిచామ‌ని అన్నారు. కోర్టు వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేసి బెయిల్ మంజూరు చేసింద‌ని తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో లక్నోలోని లులు మాల్ ప్రాంగ‌ణంలో కొంత మంది యువ‌కులు నమాజ్ చేసినందుకు కొంతమందిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయ్యింది. యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ ఎంఏ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న లులు మాల్ ను జూలై 10వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోలో లులు మాల్ ప్రాంగ‌ణంలో ఎనిమిది మంది వ్యక్తులు నమాజ్ చేసారు. ఈ వీడియోపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ మాల్ లో తాము కూడా హనుమాన్ చాలీసా, సుంద‌రాఖండ ప‌ఠిస్తామ‌ని హెచ్చ‌రించాయి. సోష‌ల్ మీడియాలో కూడా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో మేనేజ్ మెంట్ స్పందించింది. న‌మాజ్ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. 

అత్యంత వృద్ద మగ జెయింట్ పాండా యాన్ మృతి.. ప్ర‌పంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన సంతాప సందేశాలు

కాగా లులు మాల్ లో న‌మాజ్ చేసిన వారిలో ముస్లిమేత‌రులు ఉన్నారంటూ మ‌రో కొత్త అంశం లోక‌ల్ మీడియాలో ప్ర‌సారం అయ్యింది. దీనిపై క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ల‌క్నో పోలీసులు గ‌త సోమ‌వారం స్పందించారు. అందులో ముస్లిమేత‌రులు ఎవ‌రూ లేర‌ని తేల్చి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిపై జూలై 16వ తేదీన కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం, సామరస్యానికి భంగం కలిగించేలా నినాదాలు చేసినందుకు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.  

తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా మంగ‌ళ‌వారం వ్యాఖ్యానించారు. లులు మాల్ వివాదంపై అధికారులు సీరియ‌స్ గా దృష్టి నిల‌పాల‌ని అన్నారు. కొంద‌రు కావాల‌ని ఆ మాల్ కు న‌ష్టం చేకూర్చాల‌ని ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌ల‌ను ఇస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారులతో జ‌రిగిన వీడియో కాన్ష‌రెన్స్ లో సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios