తల్లి ఒడిలో నిద్రపోతున్న చిన్నారిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. బిడ్డను బడిలో పెట్టుకొని ఆ తల్లి కూడా నిద్రపోయింది. మెలకువ వచ్చి చూసే సరికి...ఒడిలో ఉండాల్సిన బిడ్డ కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మొరాదాబాద్ నగరంలోని గల్ షహీద్ ప్రాంతంలోని బస్టాండులో ఓ తల్లి తన 8 నెలల బాబుతో కలిసి రాత్రివేళ నిద్ర పోతోంది. అంతలో ఓ మహిళ వచ్చి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి పాపను ఎత్తుకొని వెళ్లింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన బస్టాండు సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది

.ఈ ఘటనపై బాధితురాలు రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో పాపను ఎత్తుకెళ్లిన ఆగంతకురాలి గురించి గాలిస్తున్నారు. పోలీసులు గాలించినా పాప ఆచూకీ లభించలేదు.