ఓ ఇంట్లో అర్దరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఎనిమిది నెలల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని వర్కాల సమీపంలోని Cherunniyoor చోటుచేసుకుంది.
ఓ ఇంట్లో అర్దరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఎనిమిది నెలల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని వర్కాల సమీపంలోని Cherunniyoor చోటుచేసుకుంది. మృతులను ప్రతాపన్, అతని భార్య షేర్లీ, పెద్ద కొడుకు నిఖిల్ భార్య అభిరామి, చిన్నకొడుకు అఖిల్, అభిరామి ఎనిమిది నెలల బాబు రియాన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిఖిల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇంటి ఆవరణలో పార్క్ చేసిన మూడు బైకలు పూర్తిగా దగ్దమయ్యాయి.
ఈ ఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంట్లో నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లోని వారికి కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి మంటలకు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటల నుండి వచ్చే పొగను పీల్చడం వల్ల ఇంట్లోని వారు మృతిచెందిన ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు వివరాలు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక, ప్రతాపన్ ఆ ప్రాంతంలో వెజిటేబుల్ షాష్ నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పారు. కాగా, ఈ ప్రమాదానికి గల అసలు కారణంపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
