ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు సుమారు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ పేరిట భారీ కూంబింగ్‌కు దిగారు.

ఈ క్రమంలో కసాల్పవాడ్ అటవీప్రాంతంలో మావోలు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమవ్వగా, భారీగా మందుగుండు సామాగ్రి లభ్యమైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.