మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

అయితే మావోలు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు కూడా ప్రతిఘటించాయి. ఎదురుకాల్పుల్లో సుమారు 8 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరిని ఇంకా గుర్తించాల్సి వుంది. భారీ సంఖ్యలో సహచరులను కోల్పోవడంతో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉండటంతో అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.