ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లా ఫేస్ గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. కాగా... మరొకరు గల్లంతయ్యారు. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... స్థానిక దేవల్ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు.  అతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువుల దాదాపు 14మంది జీపులో బయలు దేరి వెళ్లారు. కాగా... మార్గమధ్యంలో ఆ జీపు లోయలో పడింది. దీంతో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా... డ్రైవర్ సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుుల జబ్బీర్ సింగ్(320, సురేంద్ర సింగ్(30), మదన్ సింగ్(60), దర్బాన్ సింగ్(38), కైలాష్ సింగ్(40), గోపాల్ సింగ్(35), ధరమ్ సింగ్(55)లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జై సింగ్ ధను(48) అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ గవర్నర్ బేజీ రాణి మౌర్య, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.