లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

యూపీ రాష్ట్రంలోని మోరాదాబాద్- ఆగ్రా జాతీయ రహదారిపై సంభాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు.  ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.