జార్ఖండ్ రాష్ట్రంలోని పంచఖేరో డ్యామ్ వద్ద పడవ బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
న్యూఢిల్లీ: Jharkhand, రాష్ట్రంలోని Koderma లో పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా అధికారులు చెబుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది Panchkhero Dam వద్దకు ఆదివారం నాడు ఉదయం వచ్చారు. డ్యామ్ లో Boat పై వీరు ప్రయాణం చేస్తున్న పడవ గాలుల ఉధృతికి పడవ మునిగింది. పడవ మునిగిన సమయంలో పడవ నుండి డ్యామ్ లో పడిపోయిన ఓ వ్యక్తి ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన మర్కచో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది.
రాజ్ ధన్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కుటుంబం పంచఖేరో డ్యామ్ ను సందర్శించడానికి వచ్చారు. ఈ డ్యామ్ లో ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటన నుండి ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ఘటనలో ప్రదీప్ సింగ్ కు చెందిన 17 ఏళ్ల కొడుకు శివమ్ సింగ్ , 14 ఏళ్ల పాలక్ కుమారి, లు చనిపోయారు.
అంతేకాదు 40 ఏళ్ల సీతారాం యాదవ్, అతని ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు. 16 ఏళ్ల ఫెజల్ కుమారి, 8 ఏళ్ల హర్షల్ కుమార్, 5 ఏళ్ల బావువా, 16 ఏళ్ల రాహుల్ కుమార్, 14 ఏళ్ల అమిత్ కుమార్ మరణించారు. వీరంతా రాజ్ ధన్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. బోటు డ్యామ్ మధ్యలోకి రాగానే మునిగిపోయిందని ఈ ఘటన నుండి బయట పడిన ప్రదీప్ కుమార్ చెప్పారు.
ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణదేవి కొడెర్మా కు చెందిన అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
