కేరళలోని వాయనాడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మనంతవాడిలోని కన్నోత్మల సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా  ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. 

కేరళలోని వాయనాడ్ లో ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. మనంతవాడిలోని పనవల్లి సర్వాణి మలుపు వద్ద ఓజీపు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలొ తొమ్మిది మంది మృతి చెందగా, నలుగురు గాయపడినట్టు తెలుస్తోంది. వలాద్-మనంతవాడి రహదారిపై ఈ ప్రమాదం జరిగిందనీ, ప్రమాదం సమయంలో జీపులో కనీసం 12 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

బాధితులందరూ.. ఓ ప్రైవేట్ టీ ఎస్టేట్‌లో పనిచేసి జీపులో మక్కిమలకు తిరిగి వస్తోన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద అనంతరం బాధితులందర్నీ మనంతవాడిలోని ఆసుపత్రికి తరలించగా వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలియజేశాడు. ఇదిలావుండగా, కోజికోడ్‌లో ఉన్న అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమాద స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స సహా అన్ని చర్యలను సమన్వయం చేయాలని, ఇతర అవసరమైన పనులను చేపట్టాలని సిఎం ఆదేశాలు ఇచ్చారని సిఎంఓ ఓ ప్రకటన తెలిపింది.


రాహుల్ గాంధీ విచారం

ఈ విషాద సంఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "వాయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన రోజు ప్రమాదంపై బాధితులకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది తేయాకు తోటల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన జీపు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి.. వేగంగా స్పందించాలని ఆదేశించారు. నా ఆలోచనలు దుఃఖంలో ఉన్న కుటుంబాలు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అని ప్రకటించారు.