అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. శ్రేయ్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. 

ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా 35 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. ఫైర్ పైటర్స్ అగ్నిప్రమాదాన్ని అరికట్టాయి. ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఈ ప్రమాదం సంభవించింది.

వివరాలు అందాల్సి ఉంది.