Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా.. ఒక్కరోజే భారీగా పెరిగిన కేసులు

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,01,282 ఉండగా, 29,01,908 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 66,333 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.98 శాతంగా ఉంది. 

78357 new cases take India's Covid-19 tally past 37 lakh, death toll rises to 66,333
Author
Hyderabad, First Published Sep 2, 2020, 11:26 AM IST

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 37 లక్షల 69 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,357 కేసులు నమోదు కాగా, 1045 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 62,026 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 37,69,530 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,01,282 ఉండగా, 29,01,908 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 66,333 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.98 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.76 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.26 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,12,367 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 4,43,37,201 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios