ఢిల్లీలో 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా, మరింతమందికి లక్షణాలు!

తాజాగా ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో మరో 77 మంది జవ్వాన్లు కరోనా పాజిటివ్ గా తేలారు. ఈ కొత్తగా నమోదైన 77 పాజిటివ్ కేసులతో కలుపుకొని ఆ సంఖ్య 122 కు చేరింది. 

77 CRPF personnel test positive in delhi, taking the tally to 122

భారతదేశంలో లాక్ డౌన్ విధించి 38 రోజులు గడుస్తున్నప్పటికీ... దాని విజృంభణ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో మరో 77 మంది జవ్వాన్లు కరోనా పాజిటివ్ గా తేలారు. ఈ కొత్తగా నమోదైన 77 పాజిటివ్ కేసులతో కలుపుకొని ఆ సంఖ్య 122 కు చేరింది. 

ఈ కరోనా వైరస్ సోకిన వారందరిని ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వీరితోపాటుగా మరో 100 మంది జవాన్ల సాంపిల్స్ ని కూడా టెస్టింగ్ కి పంపించారు. ఆ ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

ఇలా ఒక్కసారిగా ఇంతమంది కరోనా పాజిటివ్ గా తేలడం, మరింతమందిలో ఈ వైరస్ లక్షణాలు కనబడుతుండడంతో ఢిల్లీ మయూరి విహార్  సీఆర్పీఎఫ్ బెటాలియన్ కేంద్రంలో సీరియస్ వాతావరణం నెలకొంది. 

ఈ మొత్తం సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కేసులు పెరగడానికి కారణం కుప్వారాలో విధులు నిర్వహించిన ఒక జవాన్. ఇలా సీఆర్పీఎఫ్ కేంద్రంలో వైరస్ ఇంతలా వ్యాప్తిచెందడంపై కేంద్ర హోమ్ శాఖ సీరియస్ అయింది. దీనితో అంతర్గత విచారణకు ఆదేశించింది  సీఆర్పీఎఫ్. 

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించిన తరువాత 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధననుమార్చి 5 రోజులకు కుదించిన ఐజీ పై  సీఆర్పీఎఫ్ సీరియస్ అయింది. 

జవాన్లు  తిరిగి చేరడానికి 5 రోజుల క్వారంటైన్ సమయం సరిపోతుందనడంతో... ఆ సదరు జవాన్ వచ్చి జాయిన్ అయ్యాడు. అతనికి లక్షణాలు కనబడడం 10 రోజుల తరువాత ప్రారంభమయింది. అప్పటికే... వైరస్ అక్కడ చాలామందికి సోకింది. 

అలా ఆ వైరస్ ఇప్పటికి కూడా తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. ఈ జవ్వాన్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన తరువాత మరలా క్వారంటైన్ రోజులను 14 కు పెంచింది  సీఆర్పీఎఫ్. ఇలా క్వారంటైన్ సమయాన్ని ఎందుకు కుదించారనేదానిపై స్వయంగా  సీఆర్పీఎఫ్డీజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios