Asianet News TeluguAsianet News Telugu

కాసేపట్లో అంత్యక్రియలు.. పాడె మీదినుంచి లేచి కూర్చున్న.. 76 యేళ్ల కరోనా బాధితురాలు..

మహారాష్టలో ఓ విచిత్ర సంఘట జరిగింది.  కరోనా సోకిన ఓ వృద్ధురాలు చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఆమె దహన సంస్కారాలు ముగిసేవి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా ఆమె లేచి కూర్చుంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా అందరికీ చెమటలు పట్టాయి.

76-year-old Covid positive woman wakes up minutes before cremation in Baramati - bsb
Author
Hyderabad, First Published May 15, 2021, 4:45 PM IST

మహారాష్టలో ఓ విచిత్ర సంఘట జరిగింది.  కరోనా సోకిన ఓ వృద్ధురాలు చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఆమె దహన సంస్కారాలు ముగిసేవి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా ఆమె లేచి కూర్చుంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా అందరికీ చెమటలు పట్టాయి.

మహారాష్ట్ర పూణే జిల్లా బారామతి లోని ముదాలే గ్రామంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.  ఈ ఘటన స్థానికంగా సంచలనమై కూర్చుంది. అలా లేచి కూర్చున్న ఆ మహిళ పేరు శకుంతల గైక్వాడ్. వయస్సు 76 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచారు. అయినప్పటికీ ఆమె కోలుకోక పోగా ఆరోగ్యం మరింత క్షీణించింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బారామతి లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అక్కడ ఆమెకు బెడ్ దొరకకపోవడంతో కారులోనే ఉండి నిరీక్షించ సాగారు. కాసేపటికి ఆమె స్పృహ కోల్పోయి, అచేతనంగా మారింది. దీంతో ఆమె చనిపోయిందని భావించి కుటుంబ సభ్యులు గ్రామంలోని బంధువులకు విషయం చెప్పి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని చెప్పి బయల్దేరారు.

తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాటులో మునిగిపోయారు. శకుంతల మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్మశానానికి తరలించేందుకు వృద్ధురాలిని పాడెపై ఉంచారు. అంతే ఒక్కసారిగా వృద్ధురాలు ఏడుస్తూ కళ్ళు తెరిచింది.

అది చూసి ఒక్క క్షణం భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను పాడెపై నుంచి లేపి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బారామతి సిల్వర్ జూబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios