Asianet News TeluguAsianet News Telugu

75వ స్వాతంత్య్ర దినోత్సవం: కరోనాపై పోరు ఇంకా ముగియలేదు.. జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

75th independence day eve president ramnath kovind addresses the nation
Author
New Delhi, First Published Aug 14, 2021, 7:23 PM IST

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఒలింపిక్ విజేతలను రాష్ట్రపతి అభినందించారు. కరోనాపై పోరు ఇంకా ముగియలేదని.. మహమ్మారి కట్టడికి వ్యూహాత్మకంగా వ్యవహరించామని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని రాష్ట్రపతి అన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్‌ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామని రామ్‌నాథ్ గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని.. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యాని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగిందని... సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది అని రామ్‌నాథ్ కోవింద్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios