దేశంలో రోజు రోజుకీ మహిళలపై రక్షణ లేకుండా పోతోంది.  మహిళలపై దారుణాలు కూడా పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా కూడా లేకుండా కామాంధులు.. మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ 75ఏళ్ల బామ్మపై కూడా కామాంధుడు  దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో కోలెంచెరి ప్రాంతంలో జరిగింది. 

బాధితురాలు చాలాకాలంగా మెమరీ లాస్‌తో బాధపడుతోందని తెలుస్తోంది. ఆమె మర్మాంగాలు, శరీరంలోని కొన్ని ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. సదరు మహిళ గురించి తెలిసిన వ్యక్తే దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.