కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదు.. 75% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు.. జల్ జీవన్ మిషన్ విజ‌యాలు !

Jal Jeevan Mission: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మ‌హిళ‌లు తాగునీటి కోసం కిలో మీట‌ర్ల దూరం బిందెల‌తో వెళ్లాల్సిన ప‌నిలేదు. "జల్ జీవన్ మిషన్ : హర్ ఘర్ జల్" కింద దేశవ్యాప్తంగా 75 శాతం గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయి.
 

75 Percent of the households have tap water directly. Here are the achievements of Jal Jeevan Mission: Har Ghar Jal Mission RMA

Jal Jeevan Mission: Har Ghar Jal: త‌ల‌పై కుండ‌లు, బిందెలు పెట్టుకుని తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో కిలో మీర్ల దూరం న‌డ‌వాల్సిన ప‌నిలేదు. తాగు నీటి కోసం మ‌హిళ‌లు సంవ‌త్స‌రాలుగా ప‌డుతున్న క‌ష్టాల‌ను దూరం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీని కోసం జ‌ల్ జీవ‌న్ మిష‌న్: హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ మిష‌న్ ను తీసుకువ‌చ్చింది. దేశవ్యాప్తంగా గ్రామీణ గృహాలకు స్వచ్ఛమైన, తగినంత తాగునీరును కుళాయిల ద్వార అందించ‌డంలో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 15 ఆగస్టు 2019న "జల్ జీవన్ మిషన్: హర్ ఘర్ జల్"ను ప్రారంభించింది.

మార్చి 7, 2024న, ఈ మిషన్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. "హర్ ఘర్ జల్" మిషన్ కింద, భారతదేశంలోని 75 శాతం కుటుంబాలకు పంపు నీటిని విజయవంతంగా అందిస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ఇళ్లకు కుళాయి నీటిని అందిస్తున్నారు. 2019 వరకు 3 కోట్ల 23 లక్షల గ్రామీణ ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు చేరుతోంది. 4 సంవత్సరాలలో, ఇప్పుడు 14 కోట్ల 50 లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయి నీరు చేరుతోంది.

ముఖ్యమంత్రిని వెనుక నుంచి తోసారు.. మమతా బెనర్జీ త‌ల‌కు తీవ్ర‌గాయం

75 Percent of the households have tap water directly. Here are the achievements of Jal Jeevan Mission: Har Ghar Jal Mission RMA

జల్ జీవన్ మిషన్ ప్రధాన విజయాలు : 

  • దేశంలోని 14.50 కోట్ల (75.15%) గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయి.
  • 185 జిల్లాలు, 1812 బ్లాక్‌లు, ఒక లక్షా 44 గ్రామ పంచాయతీలు, రెండు లక్షల 9 వేల 481 గ్రామాలు 'హర్ ఘర్ జల్' హోదాను పొందాయి.
  • జల్ జీవన్ మిషన్ కింద, జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE), అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (AES) ప్రభావిత జిల్లాలకు భారత ప్రభుత్వం కుళాయి కనెక్షన్‌లను అందించడంలో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ప్రాంతాల్లోని 2.23 కోట్ల కంటే ఎక్కువ గృహాలకు (75.14%) కుళాయి నీరును అందుకుంటున్నాయి. 
  • మార్చి 14, 2024 నాటికి 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో (గోవా, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, తెలంగాణ, పుదుచ్చేరి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్) 100% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీరు అందిస్తున్నారు.
  • మార్చి 14, 2024 నాటికి దేశవ్యాప్తంగా 9 లక్షల 30 వేల 460 పాఠశాలలు, 9 లక్షల 65 వేల 960 అంగన్‌వాడీ కేంద్రాలకు కుళాయి నీరు సరఫరా జ‌రుగుతోంది.
     

LPG Cylinder Prices : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios