Asianet News TeluguAsianet News Telugu

LPG Cylinder Prices : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !

LPG Cylinder Subsidy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే ఆరు గ్యారెంటీలను అమ‌లు చేస్తామ‌ని కాంగ్రెస్ ప‌లు హామీలు ఇచ్చింది. దీనిలో భాగంగా రూ.500 సిలిండ‌ర్ ను అందిస్తోంది. 
 

LPG Cylinder Price: Telangana's Rs 500 cylinder subsidy money is going into the account of the beneficiaries RMA
Author
First Published Mar 15, 2024, 6:50 AM IST

LPG Cylinder Prices: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ 6 హామీల పథకాలను అమ‌లు చేస్తోంది. తెలంగాణలోని పేదల‌ను ఆదుకునేందుకు మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ రాష్ట్ర గృహాలకు రూ. 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తోంది. రూ. 500 అందించే గ్యాస్ సిలిండర్ పథకంతో తెలంగాణాలోని అనేక పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయుత‌నందిస్తుంద‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన రూ.500 సిలిండ‌ర్ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే అర్హుల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం ఆయా కుటుంబాల‌కు రూ.500ల‌కే ఎల్పీజీ సిలిండ‌ర్ ను అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే పూర్తి న‌గ‌దు చెల్లించిన తీసుకుంటున్న వారి అకౌంట్లు స‌బ్సీడీ డ‌బ్బును ప్ర‌భుత్వం జ‌మ చేస్తోంది. ఇప్ప‌టికే సిలిండ‌ర్లు తీసుకుంటున్న ప‌లువురి ల‌బ్దిదారుల‌ అకౌంట్ల‌లో డబ్బులు ప‌డుతున్నాయి. సిలిండ‌ర్ ధ‌ర రూ.974 రూపాయ‌లు ఉండ‌గా, కేంద్ర ప్ర‌భుత్వం 47.38 రూపాయ‌లు స‌బ్సిడీ అందిస్తోంది.

అలాగే, రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్కో సిలిండ‌ర్ పై రూ.426.62 స‌బ్సిడీని అందిస్తోంది. దీంతో ప్ర‌స్తుతం అందిస్తున్న రూ.500 సిలిండ‌ర్ ప‌థ‌కంతో ప్ర‌స్తుత ఎల్పీజీ ధ‌ర‌ మొత్తం డ‌బ్బును చెల్లించి తీసుకుకోవాలి. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం 500 రూపాయ‌లు పోనూ మిగ‌తా న‌గ‌దును ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేస్తోంది. అయితే, తాజాగా కేంద్ర‌ ప్ర‌భుత్వం ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై రూ.100 త‌గ్గింపును ప్ర‌క‌టించింది. ఇది అమ‌ల్లోకి రావ‌డంతో ప్రస్తుతం తెలంగాణ‌లో సిలిండర్ ధ‌ర రూ.850 చేరుకుంది.

కాగా, ఈ ప‌థ‌కానికి ఎవ‌రైనా అర్హులు ఉండి ఇంకా ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోతే మ‌రోసారి అప్లై చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. త‌మ‌త‌మ మండ‌ల కార్యాల‌యాల్లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరు ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వీలు క‌ల్పించిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

 

Congress' guarantees will empower my dear sisters in Telangana.

The Mahalakshmi scheme will guarantee ₹2,500/month for women, LPG cylinder at ₹500 and free bus travel for women in TSRTC.

We are committed to fulfilling our promises.

It has been my dream to see a Congress govt… pic.twitter.com/moyqQF9sBx

— Congress (@INCIndia) September 17, 2023

ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు.. మహీ రిటైర్ పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమై కామెంట్స్ ! 

Follow Us:
Download App:
  • android
  • ios