Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో కరోనా కలకలం: 24 గంటల్లో 72 వేల కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.  గత ఏడాది అక్టోబర్ మాసం తర్వాత 72 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

72330 New Covid Cases In India, Biggest 1-Day Spike Since Early October lns
Author
New Delhi, First Published Apr 1, 2021, 10:34 AM IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.  గత ఏడాది అక్టోబర్ మాసం తర్వాత 72 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని  అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గత 24 గంటల్లో దేశంలో 72,330 కేసులు నమోదయ్యాయి.  గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన 74,383 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 72,330 కేసులు నమోదైనట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య  1,22,21,665 గా నమోదైంది.  కరోనాతో ఇప్పటివరకు  1,62,927 మంది మరణించారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.  45 ఏళ్లు దాటినవారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని కేంద్రం తెలిపింది.

ఈ ఏడాది మార్చి 1వ తేదీన 60 ఏళ్ల ఎక్కువ వయస్సున్నవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఇవాళ రెండో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios