దేశంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది అనడానికి ఇది మరో ఉదాహరణ. ఇప్పటికే హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం దేశం మొత్తం వణికిపోయింది. ఆ ఘటన నిందితుకుల ఇంకా శిక్ష పడనేలేదు. ఈ దుర్ఘటన నుంచి ఎవరూ ఇంకా బయట కూడా పడేలేదు. కానీ... అచ్చం  అలాంటి సంఘటనలు మాత్రం రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. 

రెండు రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై మద్యం సేవించి కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి అనంతరం స్కూల్ బెల్టుతో ఉరివేసి హత్య చేశారు. తాజాగా... ఓ 70ఏళ్ల బామ్మపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

సోన్‌భద్రా జిల్లా అన్పర గ్రామంలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై రాంకిషన్ అనే యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన సంచలనం రేపింది. యూపీ పోలీసులు రంగంలోకి దిగి బాధిత వృద్ధురాలిని ఆసుపత్రికి పంపించి చికిత్స చేపిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాంకిషన్ అనే యువకుడిని యూపీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

యూపీలో బీజేపీ పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలో మహిళల పరిస్థితి నానాటికి దిగజారి పోతుందని, వృద్ధురాళ్లే కాదు బాలికలను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని అఖిలేష్ విమర్శించారు. యూపీలో మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.