ఓ బాలికను లైంగికంగా వేధించిన 70 యేళ్ల వయసు గల సన్యాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని ముంబై లో వెలుగు చూసింది. ముంబైలోని 
 ఘట్ కోపర్ ఈస్ట్ ప్రాంతంలోని జైన దేవాలయంలో సన్యాసి మన్హార్ మునిదేశాయ్ ఓ బాలికను లైంగికంగా వేదించాడు.

ఈ కేసులో సెషన్స్ కోర్టు మునిదేశాయ్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కరోనా మహమ్మారి కారణంగా అతని అరెస్టులో కాస్త ఆలస్యం జరిగింది. దీంతో ఘట్ కోపర్ జైన దేవాలయంలో మునిదేశాయ్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.  

దేవాలయంలో పనిచేస్తున్న కార్మికుడు అతని ఆత్మహత్యను గమనించి రాజవాడి ఆస్పత్రికి తరలించారు. మునిదేశాయ్ ను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించాడని ప్రకటించారు. 

సంఘటన స్థలంలో మునిదేశాయ్ సూసైడ్ నోట్ కనిపించింది. మరణానంతరం జీవితంలో తనతో చేరేందుకు గురువు ప్రపంచాన్ని త్యాగం చేయమని కోరారని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దేశాయ్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

ఆత్మహత్య చేసుకున్న సన్యాసి దేశాయ్ 2012లో 19 యేళ్ల బాలికను లైంగికంగా వేదించాడని రుజువు కావడంతో అతనికి కోర్టు దోషిగా తేల్చి, శిక్ష విధించింది.