జమ్మూకాశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయను తమ ఆధినంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువు గాలించాయి.

ఈ క్రమంలోనే దాదాపు 70 మంది ఉగ్రవాదులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వీరందరిని వాయుసేన ప్రత్యేక విమానంలో ఆగ్రాకు తరలించినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.