Medininagar: ఏడేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పాలు సరఫరా చేసేందుకు తన నివాసానికి వచ్చిన సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని, పాల వ్యాపారి మొబైల్ ఫోన్‌లో ఏదో చూపుతానని చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
7-Year-Old Girl Raped By Milkman: ఏడేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పాలు సరఫరా చేసేందుకు తన నివాసానికి వచ్చిన సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని, పాల వ్యాపారి మొబైల్ ఫోన్‌లో ఏదో చూపుతానని చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తిని జార్ఖండ్ లోని పలాము జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 180 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు పాలు సరఫరా చేసేందుకు ఇంటికి వచ్చినప్పుడు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. పాల వ్యాపారి మొబైల్ ఫోన్ లో ఏదో చూపిస్తానని నమ్మించి ఆమెను ప్రలోభాలకు గురిచేశాడు. నిందితుడు ఆమెను పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రిషవ్ గార్గ్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సత్వర చర్యలు తీసుకుని నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. బాలికను పరీక్షల నిమిత్తం మేదినీనగర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత దర్యాప్తు అధికారులు తెలిపారు.
విదేశీ పౌరురాలికి లైంగిక వేధింపులు
దేశంలో సమాజసేవ చేయడానికి వచ్చిన విదేశీ యువతిపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులు గురిచేశాడు. భారత్ పరువు తీసేలా విదేశీ అతిథితో యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన 20ఏళ్ల యువతి భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి సమాజసేవ చేసుకుంటూ తమిళనాడులో వుంటోంది. విళుపురం జిల్లాలోని ఓ గ్రామంలో వుంటూ స్థానిక ప్రజలతో మమేకమై తోచిన సాయం చేస్తుంది. ఇలా విదేశీ మహిళ కాస్త పూర్తిగా తమిళ మహిళగా మరిపోయింది.
అయితే ఇటీవల విదేశీ యువతి స్నేహితురాలిని కలిసేందుకు పుదుచ్చెరిలో ప్రైవేట్ బస్సెక్కి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. బస్సులో ఆమె ఒంటరిగా కనిపించడంతో ఓ యువకుడు నీచానికి పాల్పడ్డాడు. అర్థరాత్రి ఆమె నిద్రపోతుండగా దగ్గరికి వెళ్లి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలతో యువతికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేయడంతో బస్సును నిలిపారు.
యువకుడి లైంగిక వేధింపులకు గురించి విదేశీ యువతి బస్సు సిబ్బంది, తోటి ప్రయాణికులకు తెలపగా వారు దీన్ని లైట్ గా తీసుకున్నారు. యువకుడికి మందలించి బస్సు దించేసి వెళ్ళగొట్టారు. అయితే యువతి మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాలని అనుకోలేదు. బెంగళూరు నుండి తమిళనాడు తిరిగివచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విదేశీ యువతిని వేధించిన యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు. బస్సులోని ప్రయాణికుల వివరాలను సేకరించగా నిందితుడు బెంగళూరుకు చెందినవాడిగా తేలిసింది.
