ఏడేళ్ల చిన్నారిపై చిరుతదాడి.. తీవ్ర రక్తస్రావం జరగడంతో..
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా సోనార్డి గ్రామంలో శనివారం చిరుతపులి దాడిలో ఏడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు తెలిపారు.మన్నత్ రాథోడ్ తన తాతయ్యలతో కలిసి బట్టలు ఉతకడానికి నది వైపు నడుస్తుండగా చిరుతపులి ఆమెను ఈడ్చుకెళ్లిందని వంతలి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎల్ హెచ్ సుజేత్రా తెలిపారు.

చిరుత పులి దాడిలో ఏడేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలై.. ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలోని సోనార్డి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చిన్నారి మన్నత్ రాథోడ్ బట్టలు ఉతకడానికి తన తాతయ్యలతో కలిసి నది వద్దకు వెళ్తుండగా ఆకస్మత్తుగా ఓ చిరుతపులి దాడి చేసింది. క్షణాల్లో ఆ చిన్నారిని ఈడ్చుకెళ్లిందని వంతలి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎల్‌హెచ్ సుజేత్రా తెలిపారు.
ఈ సంఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని గమనించి.. ఆమె తల్లిదండ్రితోపాటు చుట్టుపక్కల వారు బయటకు వచ్చి గమనించి గట్టిగ కేకలు వేశారు. దీంతో బాలికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది చిరుత. గ్రామస్థులు చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని అక్కడ వైద్యులు ప్రకటించారు. ఈ దాడితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులిని పట్టుకోవడానికి ఆ ప్రాంతంలో నాలుగు నుండి ఐదు బోనులను ఏర్పాటు చేశారు. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు తన తాతామామలతో కలిసి నదికి వెళ్లాలని పట్టుబట్టిందని ఆమె బంధువు తెలిపారు.
గతంలో ఇలాంటి ఘటన
చిరుత పులి దాడిలో ఏడేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది. ఆ రాష్ట్రంలో ప్రఖ్యాత పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని బారాహి శ్రేణికి సమీపంలో ఉన్న మజారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మన్ ప్రీత్ అనే ఏడేండ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్నది. ఈ సమయంలో అకస్మికంగా వెనుకనుంచి వచ్చిన ఓ చిరుత ఒక్కసారిగా వచ్చి బాలికపై దాడి చేసింది.
ఆ చిన్నారి భయంతో కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రితోపాటు చుట్టుపక్కల వారు అక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. బయటకు వచ్చి.. గట్టిగ కేకలు వేయడం, రాళ్లను విసరడం చేయడంతో చిరుత లికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది . వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే.. బాలికకు బాగా రక్తం పోవడంతో పరిస్థితి విషమించి.. చనిపోయింద. ఈ దాడిపై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారి నవీన్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. పిలిభిత్ గ్రామంలో చిరుత దాడి చేయడం ఇదే తొలిసారని అన్నారు. . సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.