Dispur: కుటుంబ కలహాల మ‌ధ్య‌ ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అంత‌కుముందు పోలీసులు చిన్నారి మృతదేహాన్ని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ (ఎస్ఎంసీహెచ్)కు తరలించారు, అక్కడకు వచ్చేసరికి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

7-Year-Old Boy Killed Over Family Dispute: భూవివాదం నేప‌థ్యంలో ఒక వ్య‌క్తి ఏడేండ్ల బాలుడి ప్రాణాలు తీశాడు. ఈ ఘ‌ట‌న అసోంలో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అంత‌కుముందు పోలీసులు చిన్నారి మృతదేహాన్ని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ (ఎస్ఎంసీహెచ్)కు తరలించారు, అక్కడకు వచ్చేసరికి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

వివ‌రాల్లోకెళ్తే.. సిల్చార్ వీధిలో భూవివాదం నేపథ్యంలో ఘర్షణకు దిగిన 30 ఏళ్ల వ్యక్తి.. ఏడేళ్ల బాలుడు, అతని తల్లిపై కత్తితో దాడిచేశారు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లికూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సిల్చార్ పట్టణంలోని పానిటాక్ని ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ (ఎస్ఎంసీహెచ్)కు తరలించారు. అక్కడకు వచ్చేసరికి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కచార్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నుమల్ మహత్తా మాట్లాడుతూ.. భూమి విషయంలో ఒక కుటుంబ సభ్యుల మధ్య వివాదం జరిగిందనీ, ఈ క్రమంలోనే శనివారం పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. 'నిందితులు తొలుత తల్లిని చంపేందుకు ప్రయత్నించగా ఆమె చేతికి బలమైన గాయం కావడంతో ఆమె తప్పించుకుంది. తల్లి వెనుకే ఆ చిన్నారి ఉంది. దుండగుడు అతడిని పట్టుకుని వెనుక నుంచి పొడిచాడు' అని తెలిపారు.

పోలీసుల వద్ద ఉన్న వీడియో సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అనీ, దోషులను వదిలిపెట్టబోమని అన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ బాధితురాలి కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా భూవివాదం ఉందనీ, గతంలో కూడా వారు దాడులకు పాల్పడ్డారని తెలిపారు.