సారాంశం
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కార్పియో జలుక్‌బరిలోని వారి కళాశాల సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
‘‘ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతులు విద్యార్థులని మేము కనుగొన్నాము. జలుక్‌బారి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది’’ గౌహతి జాయింట్ పోలీస్ కమిషనర్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇక, ఈ ప్రమాదంలో మరణించిన విద్యార్థులు అస్సాం ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందినవారని తెలుస్తోంది. అయితే స్కార్పియో వాహనాన్ని విద్యార్థులు రెంట్‌కు తీసుకున్నారని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో స్కార్పియో వాహనంలో మొత్తం 10 మంది ఉన్నారు.