గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేసేందుకు.. వారికి ఖరీదైన బహుమతులు కొనిచ్చేందుకు.. వారితో షికార్లు చేసేందుకు ఏడుగురు యువకులు చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఏడుగురు యువకులు గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో  మొబైల్ ఫోన్స్, బైక్స్ దొంగతనానికి పాల్పడ్డారు. కాగా.. శుక్రవారం వారిని పోలీసులు అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి ఆరు లక్సరీ మోటారు సైకిల్స్, రెండు స్కూటర్లు, 28 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుల్లో ముగ్గురు గురువారంమెట్రో స్టేషన్ వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని చోరీ చేస్తుండగా.. పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు. వారి ద్వారా  మరో నలుగురి సమాచారం కూడా సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

త్వరలో న్యూ ఇయర్ రాబోతోంది కనుక.. దానిని గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ చోరీలకు పాల్పడినట్లు వారు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.