ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లోని సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా దళాలకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పులోల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.