ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోలు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. బస్తర్ జిల్లా జగదల్‌పూర్ సమీపంలోని తిరియా అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోలు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆరుగురు నక్సల్స్‌ పోలీసులు ఎదుట లొంగిపోయారు.