జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హజారీబాగ్‌ జిల్లాలో వంతెనపై నుంచి ఓ బస్సు పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గిరిదిహ్ జిల్లా నుంచి రాంచీకి శనివారం దాదాపు 50 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వివ‌రాల్లోకెళ్తే.. గిరిదిహ్ జిల్లా నుంచి రాంచీకి వెళ్తున్న‌ బస్సు శ‌నివారం సాయంత్రం తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో వంతెన వంతెనపై నుంచి బస్సు అదుపు తప్పి సివాన్నే నదిలోకి దూసుకుపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స‌హాయ‌క‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు. అతివేగం వ‌ల్ల‌నే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు మరణించారు. అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు.

ఈ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని షేక్ బిహారీ ఆసుపత్రి హజారీబాగ్‌కు రిఫర్ చేస్తున్నారు. అదే సమయంలో బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్ కట్టర్ మిషన్‌తో బస్సును కట్ చేస్తున్నారు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి అద‌న‌పు బలగాలను రప్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న‌ పోలీసు ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఇత‌ర‌ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నారు.