రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. గావాలోకి ధానీ నుంచి పులేరా వెళుతున్న ఆటోను జైపూర్‌కు సమీపంలోని జోబ్నర్ ఎస్‌కేఎన్ అగ్రికల్చరల్ కాలేజీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.